Louisiana Digital News

26 Killed As Powerful Tornado Rip Through Mississippi | అమెరికాలో టోర్నడోల బీభత్సం

0



అమెరికాలో టోర్నడోలు… బీభత్సం సృష్టించాయి. గాలివాన ధాటికి మిస్సిస్సిపి
రాష్ట్రంలో 26 మంది చనిపోయారు. చాలా భవనాలు దెబ్బతినగా.. చాలాచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి పలు దక్షిణాది రాష్ట్రాల్లో….గాలివాన బీభత్సం సృష్టించింది. గోల్ఫ్ బంతి సైజులో వడగండ్లు పడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 26మంది మృతిచెందగా….పదుల సంఖ్యలో గాయాలపాలు కావటంతోపాటు నలుగురు గల్లంతైనట్లు అత్యవసర నిర్వాహణ ఏజెన్సీ ప్రకటించింది. స్థానిక, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన బృందాలు సహాయచర్యల్లో పాల్గొంటున్నట్లు ట్వీట్ చేసింది. టోర్నడోల ధాటికి ఈశాన్య జాక్సన్ , మిస్సిస్సిపిలో సుమారు 100కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లినట్లు….జాతీయ వాతావరణ సేవల విభాగం వెల్లడించింది. గ్రామీణ పట్టణాలైన సిల్వర్ సిటీ, రోలింగ్ ఫోర్క్ లో టోర్నడోలు విధ్వంసం సృష్టించినట్లు అధికారులు తెలిపారు. జరిగిన నష్టంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మిస్సిస్సిప్పి చిత్రాలు హృదయ విదారకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిస్సిసిపి కోసం చేయాల్సిన సహాయం అంతా చేస్తామని ప్రకటించారు
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

source

Leave A Reply

Your email address will not be published.